బాక్సాఫీస్ ఛాంపియన్: ‘పెద్ది’ మొదటి వారం ప్రపంచ వ్యాప్త వసూళ్లు ఎంతంటే!

బాక్సాఫీస్ ఛాంపియన్: ‘పెద్ది’ మొదటి వారం ప్రపంచ వ్యాప్త వసూళ్లు ఎంతంటే!

Published on Jun 11, 2026 12:10 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి వచ్చిన సెన్సేషనల్ కంబ్యాక్ చిత్రం “పెద్ది”. దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేసిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం గత వారం పైడ్ ప్రీమియర్స్ తోనే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని భారీ ఓపెనింగ్స్ సాధించింది. అలా మొదటి వారం రోజుల రన్ ని పెద్ది ఇపుడు బాక్సాఫీస్ దగ్గర పూర్తి చేసుకొని ఛాంపియన్ గా నిలిచింది.

అయితే పెద్ది సినిమా ఈ మొదటి వారం రన్ లో 345 కోట్ల గ్రాస్ ని రాబట్టి సెన్సేషన్ సెట్ చేసింది. చరణ్ కి సోలోగా బిగ్గెస్ట్ గ్రాసర్ గా ఇపుడు సినిమా 400 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తుంది. సో లాంగ్ రన్ లో సినిమా ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా జగపతి బాబు, శివ రాజ్ కుమార్ లు సాలిడ్ పాత్రల్లో నటించారు. అలాగే ఏ ఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం అందించగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు