మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, కోస్తా ఆంధ్ర రీజియన్‌లో ఇప్పటికీ అద్భుతమైన అక్యుపెన్సీలతో దూసుకుపోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల మైలురాయి దాటేసింది.
ప్రస్తుతానికి మరే ఇతర పెద్ద సినిమాలు రేసులో లేకపోవడంతో, 2026 సౌత్ ఇండియా బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘పెద్ది’ ఈ ఏడాది టాలీవుడ్ టాప్ గ్రాసర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, మూడో వారం లోకి అడుగుపెడుతున్న ‘పెద్ది’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ వీకెండ్‌లో టాలీవుడ్‌లో ఏకంగా ఆరు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. సమంత ‘మా ఇంటి బంగారం’తో పాటు కాక్‌టెయిల్ 2, దీవానా, ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు, వంద దేవుళ్లు, మరియు బాలన్: ది బాయ్ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ వరుస రిలీజ్‌ల కారణంగా రామ్ చరణ్ సినిమాకు థియేటర్ల సంఖ్య భారీగా తగ్గనుంది.
ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో ‘మా ఇంటి బంగారం’, ‘కాక్‌టెయిల్ 2’ చిత్రాలు ఎక్కువ స్క్రీన్లను ఆక్రమించనున్నాయి. థియేటర్లు మరియు స్క్రీన్ కౌంట్ తగ్గుతున్న నేపథ్యంలో, ఈ ఆరు చిత్రాల పోటీని తట్టుకుని మెగాపవర్ స్టార్ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద తన వసూళ్ల ప్రభంజనాన్ని ఎలా కొనసాగిస్తుందో చూడాలి.


