మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా విడుదలై 11 రోజులు అయ్యింది. ఐతే, ఈ చిత్రం విడుదలైన రెండవ ఆదివారం నాడు టిక్కెట్ల అమ్మకాలలో భారీగా పెరుగుదలను చూసింది. బుక్‌మైషోలో 160Kకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్య శనివారం నాటి 155K టిక్కెట్ల కంటే ఐదు శాతం ఎక్కువ. కాకపోతే, ఇప్పుడు అందరి దృష్టి సోమవారంపైనే ఉంది. మరి ఈ రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.
మొత్తానికి ప్రేక్షకులతో పాటు ఇటు అభిమానుల నుంచి కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద పెద్ది తన స్థిరమైన, ఆకట్టుకునే రన్ ను కొనసాగిస్తోంది. నిజానికి కొంత ప్రతికూలతను ఎదుర్కొన్నప్పటికీ, పెద్ది తన రెండో వారంలో కూడా బలమైన ఊపును కొనసాగిస్తోంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ సంస్థ రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది. వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. మొత్తానికి పెద్ది మంచి విజయాన్ని అందుకుంది.


