“పెళ్లి సందD” టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో కి ముహూర్తం ఫిక్స్!

Published on Aug 11, 2021 3:50 pm IST


ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ మరియు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం పెళ్లి సందD. ఈ చిత్రం ను రాఘవేంద్ర రావు బీ ఏ దర్శకత్వ పర్యవేక్షణ లో గౌరీ రొనంకీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలు, పోస్టర్లు సినిమా పై అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రం నుండి మరొక పాట ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ చిత్రం నుండి టైటిల్ సాంగ్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం లో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు గారు వశిష్ట పాత్ర లో తొలిసారి గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :