ఓటీటీలోకి “పెళ్లి సందD”.. ఎప్పుడంటే?

Published on Jun 22, 2022 1:00 am IST

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీ లీలా హీరోయిన్‌గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకీ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘పెళ్లి సందD’. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ మరియు ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై మాధవీ కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు ఈ చిత్రాన్ని నిర్మించారు. గతేడాది అక్టోబర్‌ 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

అయితే తాజాగా ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది. పెళ్లి సందD చేయడానికి రెడీనా? మా సినిమా రెడీ! ముహుర్తం 24 జూన్, అందరూ ఆహ్వానితులే.. అంటూ జీ5 ఈ సినిమా స్ట్రీమింగ్‌ డేట్‌ను ప్రకటించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా మొత్తానికి ఈ శుక్రవారం నాడు ఓటీటీలోకి వచ్చేస్తోందన్న మాట. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఈ శుక్రవారం నుంచి జీ5లో చూసేయొచ్చు.

సంబంధిత సమాచారం :