ఆర్ఆర్ఆర్’ డిజిటల్, శాటిలైట్ హక్కుల భాగస్వాములు ఎవరంటే..

ఆర్ఆర్ఆర్’ డిజిటల్, శాటిలైట్ హక్కుల భాగస్వాములు ఎవరంటే..

Published on May 26, 2021 7:31 PM IST

ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ ‘రణం రౌద్రం రుధిరం’ యొక్క శాటిలైట్, డిజిటల్ హక్కులను పెన్ స్టూడియోస్ సంస్థ పెద్ద మొత్తానికి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ హక్కులను ఇతర సంస్థలకు విక్రయించడం జరిగింది. ఏయే సంస్థకు ఏయే హక్కులు విక్రయించింది పెన్ ఇండియా సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల డిజిటల్ హక్కులను జీ 5 సంస్థ, హిందీ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్ధ దక్కించుకుంది.

ఇక విదేశీ భాషలైన ఇంగ్లీష్, పోర్చ్ గీస్, కొరియన్, టర్కిష్ మరియు స్పానిష్ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కూడ నెట్ ఫ్లిక్స్ చేతిలోనే ఉన్నాయి. శాటిలైట్ హక్కుల భాగస్వాముల విషయానికొస్తే తెలుగు హక్కులను స్టార్ మా, హిందీ రైట్స్ జీ సినిమా, తమిక హక్కులు స్టార్ తమిళం, కన్నడ హక్కులను స్టార్ కన్నడ, మలయాళం హక్కులను ఏషియానెట్ సొంతం చేసుకున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా యొక్క శాటిలైట్, డిజిటల్, థియేట్రికల్ హక్కులన్నీ కలిపి దాదాపు 900 కోట్ల వరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ రీత్యా ఈ విడుదల సాధ్యమవుతుందో లేదో స్పష్టత లేకుండా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు