“స‌ర్కారు వారి పాట” నుంచి పెన్నీ వీడియో సాంగ్ రిలీజ్‌..!

“స‌ర్కారు వారి పాట” నుంచి పెన్నీ వీడియో సాంగ్ రిలీజ్‌..!

Published on Jun 12, 2022 3:00 AM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వచ్చిన చిత్రం “సర్కారు వారి పాట”. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ చిత్రం మే 12న థియేటర్స్‌లో విడుదలై హిట్ టాక్‌ని అందుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లను రాబట్టుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ‘పెన్నీ’ వీడియో సాంగ్‌ని రిలీక్ చేశారు. థ‌మ‌న్ స్వ‌ర ప‌రిచిన ఈ పాట ట్యూన్‌ కొత్త‌గా.. లిరిక్స్ క్యాచీగా ఉండ‌టంతో ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చేసింది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాట‌ను న‌కాష్ అజీజ్ ఆల‌పించాడు. ఇటీవ‌లే విడుద‌లైన మురారి వా వీడియో సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు