ప్రత్యేక ఇంటర్వ్యూ : నాగార్జున అక్కినేని – ప్రతి ఆఫీసర్ నాలా ఉంటే బాగుంటుందని అనుకుంటారు !

ప్రత్యేక ఇంటర్వ్యూ : నాగార్జున అక్కినేని – ప్రతి ఆఫీసర్ నాలా ఉంటే బాగుంటుందని అనుకుంటారు !

Published on May 31, 2018 1:47 PM IST

సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం ‘ఆఫీసర్’. ఆర్జీవీతో కలిసి నాగ్ చేసిన ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా ఆయన 123తెలుగు జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..

చెప్పండి నాగార్జునగారు విడుదల పట్ల కంగారుగా ఏమైనా ఉందా ?
ఈ కంగారు ప్రతి సినిమాకి ఉండేదే. మనం ఒక ప్రయత్నం చేశాం. దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి అనే ఒక చిన్న కంగారు ఉంటుంది.

మీరు సినిమాల్లో దాదాపు అన్ని ప్రయోగాలు చేశారు. ఇంకా ఏమైనా చేయాలని ఉందా ?
నాకు ఎప్పటి నుంచో జానపదం, పౌరాణిక సినిమాలు చేయాలని కోరిక. ఎందుకో దర్శకులెవరూ నా వద్దకు అలాంటి కథల్ని తీసుకురాలేదు.

ఈ సినిమా చేసేప్పుడు ఆర్జీవీలో మీకు పాత ఫైర్ కనిపించిందా ?
వర్మలో ఫైర్ ఎప్పుడూ తగ్గలేదు. ‘శివ’ సినిమా తీసేప్పుడు ఎలా ఉన్నది ఇప్పుడూ అలానే ఉన్నాడు. కానీ మనసుపెట్టి సినిమాలు చేయాలంతే.

మరి అప్పటికి ఇప్పటికి వర్మ సినిమాలు చేసే విధానంలో మార్పు ఏమైనా వచ్చిందా ?
నాకు తెలిసి వర్మ చేసిన అసలు సిసలు హీరో సెంట్రిక్ సినిమా ‘శివ’. ఆ సినిమాలో ఉన్నంత హీరోయిజం ఏ సినిమాలోనూ ఉండదు. ఆ తర్వాత ఆయన చాలా హిట్స్ తీసినా అవన్నీ డ్రామాలే. మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన ‘శివ’ లాంటి సినిమా చేశారు. ‘ఆఫీసర్’ సినిమా పూర్తిస్థాయి హీరో సెంట్రిక్ మూవీ.

ముంబైలో యాక్షన్ సన్నివేశాలని తీశారు కదా అవి ఎలా ఉండబోతున్నాయి ?
వర్మ ప్రతి యాక్షన్ సీన్ ను చాలా రియలిస్టిక్ గా ఉండేలా షూట్ చేశాడు. ఎక్కడెక్కడ కెమెరాలు పెడతాడో తెలీదు కానీ ప్రతి నటుడి యొక్క ప్రతి మూమెంట్ ను కెమెరాలో బంధించాడు.

ప్రెజెంట్ సినిమాల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు మీరు ?
అవును. ఇప్పటికే 70 శాతం కెరీర్ ను చూసేశాను. ఇంక మిగిలి ఉన్న 30 శాతం కెరీర్లో చేసే ప్రతి సినిమాను ఎంజాయ్ చేస్తూ చేయాలని అనుకుంటున్నా.

‘రక్షణ, నిర్ణయం’ లాంటి సినిమాల్లో పోలీస్ పాత్రలు చేశారు. వాటికి ‘ఆఫీసర్’ సినిమాకి తేడా ఏంటి ?
ఇందులో ఆఫీసర్ ఎక్కువ టఫ్ గా ఉంటాడు. సిన్సియర్ గా పనిచేస్తాడు. ఎవ్వర్నీ లెక్కచేయడు. ముక్కుసూటిగా ఉంటాడు. ఇందులో ఆఫీసర్ ను చూస్తే ప్రతి పోలీస్ ఇలానే ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు.

ఫైల్యూర్స్ లో ఉన్నప్పుడు మీ పిలల్లకి మీరిచ్చే సలహా ఏమిటి ?
సపోర్ట్ చేస్తాను అంతే. ఇంతటితో లైఫ్ అయిపోయినట్టు కాదు ఇంకా ముందు చాలా ఉంది. దేని గురించైనా బాధపడ్డప్పుడు ఒక సంవత్సరం తర్వాత నువ్వే ఆ విషయాన్ని తలచుకుని నవ్వుకుంటావు చూడు అని చెప్తుంటాను.

నానితో మల్టీ స్టారర్ చేయడం ఎలా ఉంది ?
చాలా బాగుంది. అస్సలు అభద్రతా భావం లేకుండా కెరీర్ కొనసాగించే నటుడు నాని. సినిమా చాలా బాగా వస్తోంది.

వైజయంతి మూవీస్ బ్యానర్ తో సినిమా చేయడం ఎలా ఉంది ?
చాలా బాగుంది. ఇంతకూ ముందు కూడ అశ్వినీ దత్ గారితో చాలా సినిమాలు చేశాను. ‘మహానటి’ సక్సెస్ తరవాత చేస్తుండటం ఇంకా బాగుంది. అందరూ చాలా బాగా వర్క్ చేస్తున్నారు.

చివరగా సినిమా గురించి ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ?
సినిమా చాలా బాగుంటుంది. పాత వర్మను చూస్తారు. కుటుంబమంతా కలిసి చూడదగిన సినిమా ఇది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు