మన డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు !

మన డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు !

Published on Feb 25, 2019 5:07 PM IST

pp

ప్రపంచంలోనే ఆస్కార్ అవార్డు అంటే అదొక అపురూపమైన అరుదైన గౌరవంగా భావిస్తుంటారు ఫిల్మ్ మేకర్స్. దాంతో భారతదేశం నుండి కూడా ప్రతి సంవత్సరం సినిమాలు పంపిస్తుంటారు మన మేకర్స్. అయినా వాటిల్లో ఒకటో రెండో ఫైనల్ లిస్ట్ వరకు వెళ్లి.. అక్కడితోనే ఆగిపోతుంటాయి. అదృష్టం బాగుండి ఎప్పుడో ఒకసారి స్లమ్ డాగ్ మిలినియర్ లాంటి మన చిత్రానికి ఒక అవార్డు వస్తుంటుంది.

కాగా, తాజాగా భారతీయ నిర్మాత గునిత్ మోంగ నిర్మించిన పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనే డాక్యుమెంటరీ, 91వ ఆస్కార్ అవార్డ్ వేడుకలో బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డును సొంతం చేసుకుంది. పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేస్తూ ఈ డాక్యుమెంటరీను రూపొందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు