సంక్రాంతికి పోటీ పడనున్న స్టార్ హీరోలు !

Published on Oct 22, 2018 8:56 am IST

తమిళ స్టార్ హీరోలు రజినీకాంత్ నటిస్తున్న’పెట్టా’ అలాగే తల అజిత్ నటిస్తున్న ‘విశ్వాసం’ చిత్రాలు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవడం దాదాపు ఖాయం అని తెలుస్తుంది. అజిత్ నటిస్తున్న విశ్వాసం షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. ఇక ఈ సినిమా పండగకు రానుందని ఎప్పుడో ప్రకటించేశారు. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది.

ఇక తలైవా రజినీ నటిస్తున్న’పెట్టా’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి , నవాజుద్దిన్ సిద్దిఖీ , సిమ్రాన్ , త్రిష ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :