అడ్వాన్స్ బుకింగ్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న “భీమ్లా నాయక్”

Published on Feb 22, 2022 6:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మచో స్టార్ రానా దగ్గుపాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ ను పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వీరి కలయిక లో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కాగా ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. హైదరాబాద్ లోని మల్టీ ప్లెక్స్ లలో అడ్వాన్స్ బుకింగ్ పెట్టిన నిమిషం లోనే అన్ని టికెట్స్ బుక్ కావడం సెన్సేషన్ అని చెప్పాలి. ఈ తరహా లో బుకింగ్స్ ఉండటం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రానా దగ్గుపాటి మరియు పవన్ కళ్యాణ్ పోటా పోటీగా నటించిన ఈ చిత్రం లో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మురళి శర్మ, సముద్ర ఖని, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :