ఫోటో మూమెంట్: పెద్ది సెట్స్ లో పెద్ది, మున్నా భయ్యాతో బుచ్చిబాబు

ఫోటో మూమెంట్: పెద్ది సెట్స్ లో పెద్ది, మున్నా భయ్యాతో బుచ్చిబాబు

Published on May 22, 2025 5:30 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. మరి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా దర్శకుడు బుచ్చిబాబు సెట్స్ నుంచి షేర్ చేసుకున్న కొన్ని పిక్స్ వైరల్ గా మారాయి.

ఈ చిత్రంలో సెన్సేషనల్ వెబ్ సిరీస్ మిర్జాపూర్ ఫేమ్ దివ్యెందు శర్మ కూడా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి తనతో పాటుగా రామ్ చరణ్ తో కలిసి ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకోవడం వైరల్ గా మారింది. మరి ఇందులో ఇద్దరు నటులు మంచి డైనమిక్ గా తమ లుక్స్ తో కనిపిస్తున్నారు. దీనితో ఇవి చూసిన ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు