ఫోటో మూమెంట్..”ఎఫ్ 3″ టీంకి బిర్యానీ ట్రీట్ ఇచ్చిన ఆలీ.!

ఫోటో మూమెంట్..”ఎఫ్ 3″ టీంకి బిర్యానీ ట్రీట్ ఇచ్చిన ఆలీ.!

Published on Jul 10, 2021 3:01 PM IST

విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో వరుస విజయ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “ఎఫ్ 2” ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో పెద్ద హిట్ చేసిన ఈ చిత్రం కి సీక్వెల్ గా తీసుకొస్తున్న చిత్రం “ఎఫ్ 3”. మరింత ఫన్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు బ్యాలన్స్ షూట్ ని శరవేగంగా జరుపుకుంటుంది.

అయితే ఈ క్రమంలోనే ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ని దర్శకుడు అనీల్ షేర్ చేసుకున్నారు. స్టార్ కమెడియన్ ఆలీ తన ఇంట్లో స్వయంగా తయారు చేసిన బిర్యానీ తమ కోసం తీసుకొచ్చి వడ్డించారని అనీల్ రావిపూడి తన చిత్ర యూనిట్ తో కలిపి ఉన్న ఫోటోని షేర్ చేసి సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్రంలో కూడా తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు – శిరీష్ లు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు