ఫోటో మూమెంట్ : సూపర్ స్టైలిష్ లుక్ లో యంగ్ మహేష్.!

Published on Aug 8, 2021 5:26 pm IST

రేపు మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆల్రెడీ ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో హంగామా మొదలయ్యిపోయింది. ఇప్పటికే మహేష్ అభిమానులు రక్తదానం కూడా మొదలు పెట్టేసేసారు. మరి ఇలా అభిమానులు మంచి హంగామాగా ఉన్న సందర్భంలో మహేష్ అభిమానులు పర్ఫెక్ట్ ట్రీట్ అన్నట్టుగా ఒక అల్ట్రా స్టైలిష్ సూపర్ పిక్ మహేష్ ది బయటకొచ్చింది.

రేపటితో 46 ఏళ్ళకి అడుగు పెట్టబోతున్నా కూడా ఇంకా అదే చార్మ్ అండ్ యంగ్ లుక్స్ తో మహేష్ నయా ఫోటో షూట్ అదరగొడుతుంది. పై షర్ట్ బటన్ విప్పి ఫార్మల్ కాస్ట్యూమ్ లో అలా కనిపించిన మహేష్ ఫోటోనే ఇప్పుడు మంచి వైరల్ అవుతుంది. ఇక ఇదిలా ఉండగా రేపు రాబోయే సర్కారు వారి పాట బ్లాస్టింగ్ అప్డేట్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి మహేష్ మరిన్ని ఇలాంటి బర్త్ డే వేడుకలు జరుపుకోవాలని మరిన్ని హిట్స్ తో ఇండియన్ సినిమా పేరును మరోస్థాయిలో నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ మా 123తెలుగు యూనిట్ సూపర్ స్టార్ కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే విషెష్ తెలియజేస్తుంది.

సంబంధిత సమాచారం :