నేడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆల్రెడీ సంబరాలు మొదలు పెట్టారు. నిన్న రాత్రి నుంచే మూమెంట్ మొదలు కాగా ఇందులో దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ డ్రాగన్ నుంచి వచ్చిన బ్లాస్టింగ్ ట్రీట్ మత్తులోనే ఇప్పుడు అభిమానులు ఉన్నారు.
అయితే ఈ చిత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాగే ఎన్టీఆర్ లు కలిసి ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకున్న పిక్ అభిమానుల కళ్ళల్లో మరింత ఆనందం నింపింది. మేకర్స్ ఈ స్పెషల్ పిక్ ని షేర్ చేసుకోగా ఇది చూసిన అభిమానులు మరింత భావోద్వేగానికి లోనై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఈ పిక్ వైరల్ గా మారింది. ఇక ఈ భారీ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
