ఫోటో మోమెంట్ : ట్రెండీ లుక్ లో ‘సన్ రైజర్స్’ కెప్టెన్ తో ‘సూపర్ స్టార్ మహేష్’

ఫోటో మోమెంట్ : ట్రెండీ లుక్ లో ‘సన్ రైజర్స్’ కెప్టెన్ తో ‘సూపర్ స్టార్ మహేష్’

Published on Apr 22, 2024 7:25 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో SSMB 29 మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీని శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందించనున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండగా మరోవైపు మూవీలో తన పాత్ర కోసం డిఫరెంట్ మేకోవర్ ని ట్రై చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్. విషయం ఏమిటంటే, తాజాగా హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, సూపర్ స్టార్ మహేష్ తో కలిసి దిగిన పిక్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఈ పిక్ లో మహేష్ బాబు ఫుల్ క్రాఫ్, మీసం, గడ్డంతో అదిరిపోయారు.

ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్ ని కలుసుకున్నందుకు ఎంతో హ్యాపీగా ఉందని కమిన్స్ పోస్ట్ చేయగా, మీకు నేను బిగ్ ఫ్యాన్ అంటూ మహేష్ రిప్లై ఇచ్చారు. కాగా వారిద్దరి పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు