ప్రస్తుతం గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తో ఓ మాసివ్ పాన్ ఇండియా సినిమా “గేమ్ చేంజర్” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ఒక్క సినిమా కోసమే రామ్ చరణ్ పలు రకాల మేకోవర్ లం సిద్ధం చేసాడు. ఫ్లాష్ బ్యాక్ లో అప్పన్న పాత్రకి అలాగే ప్రస్తుత కాలంలో ఓ యంగ్ స్టూడెంట్ లా మరో పక్క బాధ్యత గల ఐ ఏ ఎస్ అధికారిలా మూడు డిఫరెంట్ లుక్ లని సిద్ధం చేసాడు.
అయితే రామ్ చరణ్ లో తన తండ్రి టాలీవుడ్ బాస్ మెగాస్టార్ షేడ్స్ కొన్ని కొన్ని యాంగిల్స్ లో చూసినప్పుడు ఫ్యాన్స్ కి ఓ రేంజ్ కిక్ ని ఇస్తాయి. అలా గతంలో కూడా కొన్ని సినిమా స్టిల్స్ ని ఫ్యాన్స్ పోల్చుకున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి భారత దేశ రెండో అత్యున్నత పురస్కారం అయినటువంటి పద్మవిభూషణ్ అవార్డు వేడుకకి హాజరు అయ్యేందుకు తన కుటుంబంతో ఢిల్లీకి బయలు దేరి ల్యాండ్ అయ్యాడు.
అయితే ఈ క్రమంలో వచ్చిన పిక్స్ వైరల్ గా మారాయి. కొన్ని ఫోటోలు సడెన్ గా చూస్తే చిరంజీవినే చూస్తున్నామా అన్నట్టు చరణ్ కనిపిస్తున్నాడు. దీంతో ఈ సరికొత్త మేకోవర్ మాత్రం మెగా అభిమానులకి ఫీస్ట్ అని చెప్పాలి.
మరిన్ని ఫోటోలు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి