‘పిచ్చేక్కిస్తా’ నిర్మాత మరో చిత్రం ‘ఇదేదో బాగుంది’

natraj-kotturi
ఇటీవలే టాలీవుడ్ సూపర్ హీరోయిన్ కాజల అగర్వాల్ చేతుల మీదుగా ఆడియో విడుదలయ్యి సూపర్ సక్సెస్ అయిన సినిమా “పిచ్చేక్కిస్తా..”.
ఈ సినిమా నిర్మాత నటరాజ్ కొట్టూరి నిర్మాతగా స్వీట్ మిర్చిస్ స్టూడియోస్ సమర్పణలో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆ చిత్రం పేరు “ఇదేదో బాగుంది “. ఈ చిత్రం లో సూర్య శ్రీనివాస్ మరియు ఎస్ఎస్ సాహిత్యలను హీరోలుగా పరిచయం చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ” పిచ్చేక్కిస్తా చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేస్తున్నాము, మా మరో చిత్రం ఇదేదో బాగుంది అనే సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రముఖ కమెడియన్ విలక్షణమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో సూర్య శ్రీనివాస్ మరియు ఎస్ఎస్ సాహిత్య లను హీరోలుగా పరిచయం చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు గంటశాల విశ్వనాద్ సంగీత సారధ్యంలో పాటల రికార్డింగ్ పూర్తయ్యింది . సినిమాని అతి త్వరలో మొదలుపెడతాము” అని తెలిపారు.

Exit mobile version