ఎస్ఆర్ కళ్యాణ మండపానికి ఫైరసీ టెన్షన్..!

Published on Aug 7, 2021 3:00 am IST


కిరణ్ అబ్బవరం, ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరో హీరోయిన్లుగా శ్రీధ‌ర్ గాదే దర్శకత్వంలో తెరెకెక్కిన “ఎస్ఆర్ కళ్యాణ మండపం” నేడు ఒకింత అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాకు ఇప్పుడు పైరసీ టెన్షన్ పట్టుకుంది. ఉదయం విడుద‌ల కాగా సాయంత్రంలోపు ఈ సినిమా పైర‌సీ ప్రింట్ ఆన్‌లైన్‌లోకి వ‌చ్చేసింది.

అయితే దాదాపు 650 థియేటర్ల‌లో విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్స్ కూడా పర్వాలేదనిపిస్తున్నాయి. పెద్ద చిన్న అనే తేడా కూడా లేకుండా ప్రతి సినిమాని ఫైరసీ చేసేస్తున్నారు. ఇది పక్కన పెడితే కరోనా కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం బాగా తగ్గించారు. ఇలాంటి సమయంలో ఫైరసీలు వస్తే కనుక అది థియేటర్ వ్యవస్థకు మరింత మైనస్ అయ్యే ఛాన్స్ ఉందనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :