కచ్చితంగా ఓ రోజు డైరెక్ట్ చేస్తాను – నిత్యా మీనన్

కచ్చితంగా ఓ రోజు డైరెక్ట్ చేస్తాను – నిత్యా మీనన్

Published on Feb 8, 2015 9:11 PM IST

Nitya-Menon
మళయాళ కుట్టిగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమై మొదటి సినిమాతో అటు నటిగా ఇటు సింగర్ గా ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ నిత్యా మీనన్. మొదటి నుంచి తన స్టొరీ సెలక్షన్స్ మరియు నటనలో ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తోంది. నిత్యా మీనన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’. ఈ సినిమా శుక్రవారం విడుదలై హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నిత్య చేసిన ముస్లీం అమ్మాయి నజీమ్ పాత్ర ఎలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిత్యా మీనన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘నేనొక పుస్తకాల పురుగును. ఈజిప్షియన్ సింగర్ బయోగ్రఫీ చదివి నాకు మతి పోయింది. ఆ బుక్ విషయంలో ఎంతో కదిలిపోయిన నిత్యా మీనన్ తన జీవితాదారంగా ఓ సినిమా చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసే పనిలో ఉందని’ తెలిపింది. కావున త్వరలోనే నిత్యా మీనన్ మెగా ఫోన్ పట్టుకొని ఓ సినిమాకి దర్శకత్వం చేస్తుంది.

తాజా వార్తలు