“ప్లే బ్యాక్” ట్రైలర్..రెండు కాలాలతో డిఫరెంట్ గా ఉంది కానీ..

Published on Feb 26, 2021 6:48 pm IST

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమాల్లో ఎన్నో విభిన్నమైన మరియు క్లిష్ట తరమైన జానర్స్ ఉన్నాయి. మరి వాటిలో టైం పై వచ్చే సినిమాలు అంటే ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ ఎంతో ఆసక్తిగా చూస్తారు. కానీ ఈ జానర్ లో మాత్రం మన ఇండియన్ సినిమా నుంచి చాలా తక్కువే వచ్చాయి. అందులోని మన తెలుగు నుంచి అసలు పదుల్లో కూడా లేవు. కానీ మన ఇండియన్ సినిమాలోనే మొట్టమొదటి సారిగా డిఫరెంట్ లైన్ తో వస్తున్నామని చెప్తున్నారు “ప్లే బ్యాక్” టీం.

దినేష్ తేజ్ హీరోగా అనన్య నాగళ్ళ హీరోయిన్ గా హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిఫరెంట్ టైం లైన్స్ అనే కాన్సెప్టు పై తెరకెక్కింది. ఇప్పుడు వచ్చిన ఈ సినిమా ట్రైలర్ కూడా ఆ లైన్ పై కాస్త ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. గతం నుంచి ఒకమ్మాయి భవిష్యత్తులో ఉన్న ఒకబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడ్డం అనేది ఇందులో ఆసక్తికరంగా అనిపిస్తుంది. అంతే కాకుండా రెండు టైం లైన్స్ ను కలపాలి అనుకుంటే ఏం జరుగుతుంది అన్న పాయింట్స్ ఈ ట్రైలర్ లో బాగున్నాయి.

ఇక అలాగే హీరో హీరోయిన్స్ నటన కూడా ఇంప్రెసివ్ గా ఇందులో కనిపిస్తుంది. సీనియర్ నటుడు సూర్య రోల్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించనున్నట్టు అనిపిస్తుంది. మొత్తంగా మాత్రం ఈ డిఫరెంట్ అటెంప్ట్ ఇంకా క్లియర్ గా తాము చెప్పాలి అనుకున్న పాయింట్ ను మంచి థియరీతో వివరిస్తే ఖచ్చితంగా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే మార్చ్ 5న ఈ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :