మహేష్ బాబు సినిమాలో రవిగా కనిపించనున్న అల్లరి నరేష్ !
Published on Jun 30, 2018 7:02 pm IST

హీరో అల్లరి నరేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కలిసి చేస్తున్న సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నరేష్ పాత్ర పేరు ‘రవి’ అని, మహేష్ బాబుకు స్నేహితుడిగా ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న కాలేజ్ ఎపిసోడ్స్ లో మహేష్ బాబుతో కలిసి ఆయన కూడ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సిజనిమా గురించి ట్విట్టర్లో మాట్లాడిన నరేష్ మహేష్, వంశీలతో కలిసి పనిచేయడం చాలా బాగుందని అన్నారు.

పూజా హెగ్డే కకథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రైతుల రుణాలు, వాళ్ళ బీద పరిస్థితులను ప్రధానంగా సినిమాలో ప్రస్తావించడం జరుగుతుందని, అలాగే సినిమా రైతుల్లో కొత్త ఉత్తేజం నింపే తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మరింత యంగ్ గా కనిపించడం కోసం మహేష్ వర్కవుట్స్ చేస్తూ కొత్త లుక్ ట్రై చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook