23 భాషల్లో మోదీ బయోపిక్ ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు !

Published on Jan 7, 2019 4:48 pm IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్రతో తెరకెక్కనున్న చిత్రం ‘పిఎం నరేంద్ర మోదీ’. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను 23 భాషల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా ఈ రోజు లాంచ్ చేశారు. ‘సరబ్జిత్ , మేరీ కోమ్’ బయోపిక్ ల దర్శకుడు ఒమంగ్ కుమార్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, మోదీ పాత్రలో నటించనున్నాడు.

సురేష్ ఒబెరాయ్ , సందీప్ సింగ్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ఈనెల మూడవ వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ఈనెల 11న విడుదలకానుంది. మరి పొలిటికల్ నేపథ్యంలో రానున్న ఈ బయోపిక్ సినిమాలు ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More