పోలీస్ పటాస్ గొప్ప సినిమా అవుతుంది – తుమ్మలపల్లి రామసత్యనారాయణ

Published on Aug 5, 2019 8:24 pm IST

భీమవరం టాకీస్ 97వ సినిమా పోలీస్ పటాస్ ప్రమోషనల్ ట్రైలర్ ఈరోజు (సోమవారం) నిర్మాత సి.కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల కావడం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ… నా శిష్యుడు రామసత్యనారాయణ ఇది 97వ సినిమా అంటున్నాడు. కానీ నాకు తెలిసి అతను తన 100వ సినిమాను శతాధిక దర్శకుడితో ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా చేసే వరకు తాను 97,98వ సినిమా చేస్తున్నానని అంటాడు. ఏదీ ఏమైనా తాను నిర్మించబోయే అన్నీ సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్న’ అన్నారు.

నిర్మాత రామసత్యనారాయణ గారు మాట్లాడుతూ.. నేను సినిమాలు తియ్యడం నేర్చుకుంది సి.కళ్యాణ్ గారి దగ్గరే, పోలీస్ పటాస్ సినిమా అయేషా చక్కగా నటించింది. ఈ సినిమా తరువాత ఆమెకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడుతుంది. విజయశాంతి తరువాత అంత గొప్ప పేరు సంపాదించుకుంటుంది ఈ అమ్మాయి పోలీస్ పటాస్ అందరికి నచ్చే గొప్ప సినిమా అవుతుంది’ అన్నారు.

సంబంధిత సమాచారం :