ఒక్క సినిమాతో ఇద్దరు భామలకు పరీక్ష..!

ఒక్క సినిమాతో ఇద్దరు భామలకు పరీక్ష..!

Published on May 28, 2026 12:00 AM IST

తెలుగులో స్టార్ స్టేటస్ అందుకున్న పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్‌లకు గత కొన్నేళ్లుగా హిందీలో మాత్రం ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్ హిట్ పడలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి వరుణ్ ధావన్ సరసన హీరోయిన్‌లుగా నటించిన హిందీ రొమాంటిక్ డ్రామా ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.

ఈ చిత్ర ట్రైలర్‌లో తమ గ్లామరస్ లుక్స్‌తో మెప్పించిన ఈ ఇద్దరు భామల బాలీవుడ్ కెరీర్‌కు ఈ సినిమా విజయం అత్యంత కీలకం కానుంది. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో టిప్స్ ఫిల్మ్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు భామలు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నారు.

తాజా వార్తలు