మరొక స్టార్ హీరో సినిమాలో కథానాయకిగా పూజా హెగ్డే

మరొక స్టార్ హీరో సినిమాలో కథానాయకిగా పూజా హెగ్డే

Published on Oct 15, 2020 10:09 PM IST

Pooja Hegde 2 1
‘అల వైకుంఠపురములో’ విజయం తర్వాత పూజా హెగ్డే స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు స్టార్ హీరోల సినిమాలంటే ముందుగా కథానాయకిగా పూజా హెగ్డే పేరునే పరిశీలిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక్కడే కాదు హిందీలో సైతం పూజా హెగ్డే డిమాండ్ బాగా పెరుగింది. పూజా హెగ్డే నటించిన గత చిత్రం ‘హౌస్ ఫుల్ 4’ మంచి విజయాన్ని సాధించడంతో భారీ ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘కబి ఈద్ కబి దివాళి’ చిత్రంలో కథానాయకిగా ఎంపికైన ఆమె మరొక స్టార్ హీరో రన్వీర్ సింగ్ కొత్త చిత్రంలో అవకాశం దక్కించుకుంది.

దర్శకుడు రోహిత్ శెట్టి రన్వీర్ సింగ్ హీరోగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఈ చిత్రం 1982 క్లాసికల్ హిట్ ‘అంగూర్’ రీమేక్ అని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేశారు. అందులో ఒకరు జాక్వలిన్ ఫెర్నాండెజ్ కాగా మరొకరు పూజా హెగ్డే. ఇందులో రన్వీర్ సింగ్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందుకే ఆయనకు జోడీగా ఇద్దరు హీరోయిన్లను తీసుకోవడం జరిగింది. ఇప్పటికే తెలుగునాట స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందిన పూజా సల్మాన్, రన్వీర్ సినిమాలు హిట్ అయితే బాలీవుడ్ పరిశ్రమలో కూడ స్టార్ కథానాయకిగా మారిపోవడం ఖాయం. ప్రస్తుతం ఆమె ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీ ‘రాధేశ్యామ్’, అఖిల్ కొత్త చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’లో నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు