పవన్ సినిమాకు బుట్ట బొమ్మ హింట్ ఇచ్చేసినట్టేనా?

Published on Sep 3, 2021 2:45 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం నుంచి ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనుందని, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నారని, ప్రియమణి మరో కథానాయికగా నటించబోతుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ ప్రచారానికి బుట్టబొమ్మ ఒక్క ట్వీట్‌తో మరింత ఆజ్యం పోసింది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా పూజా హెగ్డే ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ ఎవరు ఊహించనిది కావడం, పవన్-హరీశ్ సినిమా ప్రీ లుక్ వచ్చిన కొద్దిసేపటికే పూజా పవన్‌కి విషెష్ చెబుతూ ట్వీట్ చేయడంతో దాదాపు ఆమె పవన్‌తో నటించబోతుందని అభిమానుల్లో ఓ అంచనా మొదలయ్యింది. మరీ ఇది ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి మరీ. ఇదిలా ఉంటే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుంది.

సంబంధిత సమాచారం :