రెమ్యున‌రేష‌న్‌పై నో కాంప్రమైజ్ అంటున్న పూజాహెగ్డే..!

Published on Jul 6, 2021 2:00 am IST


స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. ఈ బ్యూటీనీ తమ సినిమాలో హీరోయిన్‌గా తీసుకునేందుకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాతలు క్యూ కడుతున్నారంటేనే ఈ అమ్మడు క్రేజ్ ఏ మేరకు ఉందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన పూజా ఓ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారట.

అయితే ఇండస్ట్రీలో తనకున్న గ్రేస్‌ను బట్టి పెద్ద మొత్తంలో పారితోషికాన్ని తీసుకుంటున్న పూజా అందులో కొంచెం కూడా తగ్గించేందుకు ససేమిరా అంటున్నారట. ఇటీవల ఓ పెద్ద తెలుగు నిర్మాణ సంస్థ కూడా పూజాహెగ్డేను రెమ్యున‌రేష‌న్ కొంత త‌గ్గించుకోవాల‌ని రిక్వెస్ట్ చేసినప్పటికి ఆమె ఆ విషయంలో నో కాంప్రమైజ్ అని తెగేసి చెప్పినట్టు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా రాధేశ్యామ్‌, ఆచార్య‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ వంటి సినిమాల్లో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :