పూజా లేకుండానే ప్రభాస్ ‘జాన్’ మొదలుపెట్టనున్నాడట.

Published on Nov 19, 2019 10:02 am IST

సాహో చిత్ర ప్రమోషన్స్ తరువాత వెకేషన్స్, బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ కొరకు లండన్ ట్రిప్ వలన ప్రభాస్ జాన్ మూవీ షూటింగ్ షెడ్యూలు దాదాపు నాలుగు నెలలుగా వాయిదా పడింది. దీనితో దర్శకుడు రాధా కృష్ణ ఈమూవీ నెక్స్ట్ షెడ్యూల్ పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. యూరఫ్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కే ఈ చిత్రంలో పూజా హెగ్డే ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ చిత్ర తాజా షెడ్యూల్ నెక్స్ట్ వీక్లో మొదలుకానుందని సమాచారం.

హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ మూవీ షూటింగ్ నిర్వహించనున్నారు. మొదట్లో మూవీ మొత్తం యూరోప్ లో షూట్ చేయాలని భావించినా, బడ్జెట్ పరిమితుల రీత్యా సెట్స్ తో మేనేజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఐతే ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ షెడ్యూల్ నందు పూజా హెగ్డే లేకుండానే దర్శకుడు రాధా కృష్ణ షూట్ చేయనున్నారట. ప్రభాస్ పై వచ్చే కొన్ని సన్నివేశాలు ఈ షెడ్యూల్ నందు చిత్రీకరించనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More