ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పిన ‘పూజా హెగ్డే’ !

Published on Jan 27, 2020 12:00 am IST

స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా నటిస్తూ ఫుల్ క్రేజీ తో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది ‘పూజా హెగ్డే’. ‘ఒక లైలా కోసం’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో నటిస్తూ వరుస హిట్స్ అందుకుంటుంది. ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమాలో నటిస్తోంది. కాగా తాజాగా ‘పూజా హెగ్డే’ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి తన ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

‘పూజా హెగ్డే’ మాట్లాడుతూ.. నేను కథలతో పాటు సినిమా బడ్జెట్ అండ్ కలెక్షన్స్ గురించి కూడా తెలుసుకుంటాను. నా నిర్మాతలు నా పై నమ్మకంతో నేను అడిగినంత పారితోషికం ఇస్తున్నారు. వాళ్ళ సినిమాలో నేను ఉండాలనుకుంటున్నారు. అందుకే నేను నా రోల్ కు న్యాయం చేయడంతో పాటు సినిమా గురించి కూడా ఆలోచిస్తాను. నా నిర్మాతలకు లాభాలు రావడం నాకూ ముఖ్యమే కదా. ఎంతైనా నేను శెట్టి ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని. మాది బంట్‌ కమ్యూనిటీ. మా రక్తంలోనే వ్యాపారం ఉంది. మా తాతయ్యకు రెస్టారెంట్లు ఉన్నాయి. అందుకేమో నేను కూడా వ్యాపారవేత్తలానే ఆలోచిస్తాను అని చెప్పుకొచ్చింది ఈ టాల్ బ్యూటీ.

సంబంధిత సమాచారం :