‘అల వైకుంఠపురములో’.. పూజా హెగ్దే ట్వీట్ !

Published on Nov 24, 2019 10:03 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా అప్ డేట్స్ ను చిత్రబృందం వరుసగా ఇస్తూనే ఉంది. తాజాగా పూజా హెగ్దే షూటింగ్‌ లోకేషన్‌లో చిత్ర బృందంతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌ లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఈ సినిమాలో ఇంతటి గొప్ప నటినటులతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ రోజు షూటింగ్‌ లో సుశాంత్‌, నివేదా పేతురాజ్‌ మిస్‌ అయ్యార’ని పోస్ట్ చేసింది.

కాగా ఫ్యామిలీ ఎమోషన్స్ మెయిన్ ప్లాట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పోరాటాలు కూడా ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తుంది. అల వైకుంఠపురంలో మొత్తంగా ఆరు యాక్షన్ సీక్వెన్స్ స్ వరకూ ఉంటాయని సమాచారం. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా.. శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :