ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న పాన్ ఇండియాన్ చిత్రం “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇప్పుడు క్లైమాక్స్ చిత్రీకరణతో షూటింగ్ క్లైమాక్స్ లో కూడా బిజీగా ఉంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో పూజా హెగ్డే ఒక కీలక పాత్రలో కనిపిస్తుంది అని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యన రోజులు కూడా లెక్కేసుకుంటున్న ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఈ సినిమాలో ఇంకా ఎన్ని రోజులు షూట్ లో పాల్గొననుందో తెలుస్తుంది.
ఈ డిసెంబర్ 25తో రాధే శ్యామ్ లో పూజా టాకీ పార్ట్ పూర్తి కానుంది. ఇక ఆ తర్వాత మరికొన్ని సన్నివేశాలు ప్రభాస్ పై ఉన్నవి తెరకెక్కించి ఈ చిత్రాన్ని కంప్లీట్ చేసేయనున్నారు. అలాగే దీని తర్వాత పూజా ఒక బాలీవుడ్ చిత్రంలో ప్రభాస్ తన పవర్ ఫుల్ ప్రాజెక్ట్ “సలార్” లో నటించనున్నారు.


