ఆ హీరోయిన్ ప్రభాస్ పక్కన నటించబోతోంది !
Published on Mar 12, 2018 11:39 am IST

ప్రభాస్ ప్ర‌స్తుతం యూవీ క్రియేష‌న్స్ నిర్మాణంలో సుజిత్ డైర‌క్ష‌న్లో ‘సాహో’ మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాలోని యాక్ష‌న్స్ సీన్స్ ను దుబాయ్ లో తెర‌కెక్కిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ‘సాహో’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తరువాత ‘జిల్’ డైర‌క్ట‌ర్ రాధాకృష్ణతో ప్రభాస్ సినిమా చెయ్యబోతున్నాడు. గోపికృష్ణ సంస్థలో కృష్ణం రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ హీరోయిన్ బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘సాక్ష్యం’ సినిమాలో నటిస్తోంది. అనేట్టుగాక ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో కూడా కథానాయకిగా ఎంపికైన ఈమె మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమాలో కూడా నటించనుంది.

 
Like us on Facebook