రాధే శ్యామ్’లో పూజా హెగ్డే ట్విన్స్ అట ?

Published on Sep 28, 2020 12:00 am IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘రాధే శ్యామ్’. సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చిత్రంలో పూజా హెగ్డే డ్యూయెల్ రోల్ అట. ట్విన్స్ గా పూజా ఈ సినిమాలో నటిస్తోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ క్లాసిక్ డాన్సర్ ను పోలి ఉంటుందట. మరి పూజా డబుల్ రోల్ ఉండబోతుందో చూడాలి.

అన్నట్టు ఆ మధ్య విడుదలైన గద్దలకొండ గణేష్ చిత్రంలో కూడా పూజా 90ల నాటి ట్రెడిషినల్ గెటప్ లోనే కనిపించింది. ఇక రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథగా రానున్న ఈ సినిమా లాక్ డౌన్ కి ముందు జార్జియాలో చిత్రీకరణ జరుపుకుంది. కానీ ఇప్పుడు మళ్లీ అక్కడ షూట్ చేసే పరిస్థితి లేదు. అందుకే మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో నవంబర్ నుండి షూట్ చేయనున్నారు.

కాగా మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఈ చిత్రం కేవలం పాన్ ఇండియా సినిమాలా కాకుండా, పాన్ వరల్డ్ సినిమాలా తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :

More