అఖిల్ తో జాయిన్ అయిన పూజా హెగ్డే

Published on Sep 21, 2019 10:18 am IST

బ్యూటీ పూజా హెగ్డే తాజాగా వాల్మీకి చిత్రంలో దేవిగా దర్శనమిచ్చింది. కనిపించింది కొద్దిసేపే అయినా పల్లెటూరి అమ్మాయి గెటప్ లో పూజా ఆకట్టుకుంది. కాగా పూజా తెలుగులో వరుసబెట్టి చిత్రాలు చేస్తుంది. గత ఏడాది రంగస్థలంలో ఐటెం సాంగ్ తోపాటు, సాక్ష్యం, అరవింద సమేత చిత్రాలలో నటించిన ఆమె ఈ ఏడాది మహేష్ సూపర్ హిట్ మూవీ మహర్షి చిత్రంలో నటించడం జరిగింది. కాగా అక్కినేని వారసుడు అఖిల్ నాలుగవ చిత్రంలో కూడా హీరోయిన్ గా పూజా ఎంపికైన సంగతి తెలిసిందే.

ఆమె ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయ్యారట. క్లాస్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రం లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానుందని సమాచారం. అఖిల్ సినిమాలో హీరోయిన్ గా మొదట కియారా అద్వానీ, రష్మిక మందాన వంటి పేర్లు పరిశీలించి చివరకు పూజను ఎంపిక చేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల అలవైకుంఠపురంలో మూవీలో కూడా ప్రధాన నాయకిగా పూజా చేస్తున్నారు. ప్రభాస్ తదుపరి చిత్రం జాన్ లో కూడా పూజా నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More