ఫ్యాన్స్ ప్రేమగా డార్లింగ్ అని పిలుచుకునే ప్రభాస్ ని బహుశా ఇష్టపడని వారంటూ ఉండరేమో. దర్శక నిర్మాతలతో పాటు, ఆయనతో పనిచేసిన నటులు కూడా ప్రభాస్ తో తమకున్న మంచి అనుభవాల గురించి చెవుతారు. ఇక హీరోయిన్స్ ఐతే సరే సరి. ఆయనతో ఒకసారి మూవీ చేశారంటే ఆయన అభిమానులైపోతుంటారు. తాజాగా ఈ లిస్ట్ లో వచ్చిచేరింది బ్యూటీ పూజా హెగ్డే. ఆమెను మీకు పరిశ్రమలో ఇష్టమైన హీరో ఎవరని అడుగగా తడుముకోకుండా ప్రభాస్ అని చెప్పేసింది. ప్రభాస్ లాంటి నైస్ అండ్ స్వీట్ పర్సన్ ని నేను పరిశ్రమలో చూడలేదని చెప్పుకొచ్చారు.
పూజా ప్రస్తుతం జాన్ చిత్రంలో ప్రభాస్ కి జంటగా నటిస్తుంది. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈమూవీ 1960ల కాలంలో యూరప్ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ. హైదరాబాద్ లోనే కొన్ని ప్రత్యేక సెట్స్ మధ్య జాన్ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రభాస్ చిరకాల మిత్రులైన యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని కూడా నిర్మించడం గమనార్హం.


