మా ఎలక్షన్స్: ప్రకాశ్ రాజ్‌కు నటి పూనమ్‌ కౌర్‌ సపోర్ట్..!

Published on Oct 2, 2021 12:28 am IST


మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు అక్టోబరు 10న జరగనున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ సారి మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహా రావులు ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రకాశ్ రాజుకు నటి పూనమ్‌ కౌర్‌ మద్ధతు తెలిపింది. ఆమె ట్వీట్ చేస్తూ “మా” ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ సర్‌ గెలవాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.

ఆయన గెలిస్తే ఇంతకాలం పరిశ్రమలో నేను ఎదుర్కొన్న సమస్యలను బయటపెడతానని చెప్పుకొచ్చింది. అంతేకాదు ప్రకాశ్ రాజ్‌ గారికి పెద్దలంటే గౌరవమని, మాట మీద నిలబడే వ్యక్తి అని అన్నారు. ఆయన చిల్లర రాజకీయాలు చేయరని, అందుకే ఆయనకు నా మద్దతు ఉంటుందని ట్వీట్‌లో రాసుకొచ్చింది. దీంతో పాటు ప్రకాశ్ రాజ్‌తో దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది.

సంబంధిత సమాచారం :