లీకైన ‘ఇస్మార్ట్ శంకర్’ స్క్రిప్ట్ , పూరి కంప్లైంట్.

Published on Jun 8, 2019 10:46 am IST

ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా డైరెక్టర్ పూరి కంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ “ఇస్మార్ట్ శంకర్”. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ లో రామ్ ఊరమాస్ డైలాగ్స్,బాడీ లాంగ్వేజ్ కి మంచి స్పందనే వచ్చింది. హీరో మేనరిజం ఎలివేట్ చేయడంలో దిట్టైన పూరి రామ్ పాత్రను ఓ రేంజ్ లో డిజైన్ చేశాడనిపిస్తుంది. రామ్ కి జంటగా నిధి అగర్వాల్, నభా నటేష్ నటిస్తున్న ఈ మూవీ ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మిస్తున్నారు.

ఐతే ఈ మూవీ స్క్రిప్ట్ ని నా అనుమతి లేకుండా బజ్ బాస్కెట్ గ్రూప్ అడ్మిన్ మురళీ కృష్ణ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి లీక్ చేశాడని దర్శకుడు పూరీ జగన్నాథ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. . దీనిని తొలగించాలని తమ టీమ్ కోరినప్పటికీ.. భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. జూలై 12న విడుదల కానున్న నేపథ్యంలో ఇలాంటి సమస్య ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి ఎదురవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత సమాచారం :

More