స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , రవికిషన్ వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు వీరితో పాటు మరో ప్రముఖ నటుడు ఈచిత్ర షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఆయన ఎవరో కాదు ‘ఈగ , బాహుబలి’ చిత్రాల్లో నటించి తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుధీప్. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈచిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


