రావు రమేష్ కు మాతృ వియోగం !


నటుడు రావు రమేష్ తల్లి కమల కుమారి(77) మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు శనివారం ఉదయం తెల్లవారుజామున కొండాపూర్లోని రావు రమేష్ నివాసంలో కన్నుమూశారు.

ప్రముఖ నటుడు రావు గోపాలరావు సతీమణి అయిన కమల కుమారి ప్రముఖ హరికథ కళాకారిణి. పలు రాష్ట్రాల్లో ఆమె 5000లకు పైగా హరికథ ప్రదర్శనలిచ్చారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేయగా మెగాస్టార్ చిరంజీవి ఆమెకు నివాళులర్పించేందుకు రావు రమేష్ నివాసానికి బయలుదేరారు.