మూడు భిన్నమైన పాత్రల్లో టాలీవుడ్ కమెడియన్ !

Published on May 15, 2019 8:28 pm IST

హాస్యనటులు సాధారణంగా ఒకే పాత్రలో కనిపిస్తుంటారు. మూడు భిన్నమైన తరహాల్లో నటించడం అరుదు. అలాంటి అరుదైన అవకాశం హాస్య నటుడు ధన్ రాజ్ దక్కించుకున్నారు. ఇలా మూడు వైవిధ్యమైన పాత్రల్లో ధన్ రాజ్ నటించిన సినిమా స్వయంవద. లక్ష్మీ చలన చిత్ర పతాకంపై రాజా దూర్వాసుల ఈ చిత్రాన్ని నిర్మించగా…సకుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు వివేక్ వర్మ రూపొందించారు.

ఈ శుక్రవారం ఘనంగా ప్రేక్షకుల ముందుకొస్తోంది స్వయంవద. ఈ సందర్భంగా నటుడు ధన్ రాజ్ మాట్లాడుతూ…చాలా మంచి పాత్రలో నటించాను. నా పాత్ర పేరు గోరింక. మూడు భిన్నమైన పాత్రల్లో నటించాను. ఈ మూడు గెటప్ ల కోసం ఎక్కువ సమయం తీసుకోకుండా ముందుగా అనుకున్న కాల్ షీట్స్ లోనే పూర్తి చేశాం. భయపడుతూ నవ్వించే పాత్ర ఇది. కథానాయకుడికి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాను. పూజారి, మ్యారేజ్ బ్యూరో నడిపే వ్యక్తి, డాన్ ఇలా మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాను. అని చెప్పారు.

సంబంధిత సమాచారం :

More