మహేష్ సినిమాలు చూస్తుంటానన్న పాపులర్ క్రికెటర్ !

మహేష్ సినిమాలు చూస్తుంటానన్న పాపులర్ క్రికెటర్ !

Published on May 26, 2018 12:55 PM IST

నిన్న సాయంత్రం జరిగిన ఐపిఎల్ క్వాలిఫైయర్స్ మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్, కలకత్తా నైట్ రైడర్స్ జట్లు తలపడగా హైదరాబాద్ ఫైనల్స్ కు చేరుకుంది. హైదరాబాద్ జట్టు సభ్యుడు, ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ 10 బంతుల్లో 34 పరుగులు చేసి 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి చెలరేగడంతో మ్యాచ్ హైదరాబాద్ సొంతమైంది. .

రషీద్ ఖాన్ ఆట చూసిన పాఫులర్ క్రికెటర్లు, సెలబ్రిటీలు అందరూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడ ఉన్నారు. మ్యాచ్ అనంతరం ట్వీట్ చేసిన మహేష్ రషీద్ ఖాన్ ను పొగడటంతో రషీద్ ఖాన్ జవాబిస్తూ ‘థాంక్స్ బ్రదర్.. మీ సినిమాలు చూడటమంటే నాకు ఆసక్తి’ అంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ విషయం మహేష్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు