ప్రముఖ నిర్మాత చేతికి పెట్టా తెలుగు హక్కులు !

ప్రముఖ నిర్మాత చేతికి పెట్టా తెలుగు హక్కులు !

Published on Dec 19, 2018 3:58 AM IST

గత కొంత కాలంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలు తెలుగులో భారీ నష్టాలను మిగిల్చాయి. అయితే ఇటీవల విడుదలైన 2.0 భారీ లాభాలను తీసుకరాకపోయిన రజినీ కి మళ్ళీ తెలుగులో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసింది. ఇక రజినీకాంత్ ప్రస్తుతం ‘పెట్టా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం యొక్క తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు.

‘జిగర్ తండా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్ , త్రిష , విజయ్ సేతుపతి , నవాజుద్దిన్ సిద్దిఖీ, బాబీ సింహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు