రజనీ సినిమాకు పాపులర్ స్టంట్ మాస్టర్ !

రజనీ సినిమాకు పాపులర్ స్టంట్ మాస్టర్ !

Published on Jun 20, 2018 6:26 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం యువ దర్శకుడు కార్తిక్ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం డార్జిలింగ్ ప్రాంతంలో జరుగుతోంది. ఇందులో కూడ రజనీ గ్యాంగ్ స్టర్ తరహా పాత్రలోనే కనిపించనున్నారట. ఈ చిత్రంలో యాక్షన్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుందట.

అందుకే ప్రముఖ స్టంట్ కొరియోగ్రఫర్ పీటర్ హెయిన్స్ ను ప్రాజెక్టులోకి తీసుకున్నారట. ఇది రజనీకాంత్ యొక్క పెర్సనల్ ఛాయిస్ అనే టాక్ కూడ వినిపిస్తోంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అనిరుద్ సంగీత దర్శకత్వం వహించనున్నారు. భిన్నమైన అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరున్న కార్తిక్ సుబ్బరాజ్ మొదటిసారి రజనీతో సినిమా చేస్తుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు