మిష్టర్ కుటుంబరావు గా “మళ్ళీ మొదలైంది” లో పోసాని కృష్ణమురళి!

Published on Aug 12, 2021 5:08 pm IST

సుమంత్, నైనా గంగూలీ హీరో హీరోయిన్ లుగా, టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం మళ్ళీ మొదలైంది. ఈ చిత్రం కి సంబంధించిన మరొక విషయం పై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ చిత్రం లో ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి మిష్టర్ కుటుంబరావు గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. విడాకుల కేసుల విషయం లో స్పెషలిస్ట్ పాత్ర లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఫ్యామిలీ మాన్ గా, భర్తల హక్కుల కోసం పోరాడే వ్యక్తి గా, రెస్టారెంట్ ల వద్ద డిస్కౌంట్ అడిగే వ్యక్తి గా కనిపించనున్నారు. ఈ చిత్రం లో పోసాని రాక తో సినిమా పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :