నంది అవార్డుల వివాదంపై ఘాటుగా స్పందించిన పోసాని !
Published on Nov 21, 2017 4:01 pm IST

ఇటీవలే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై ఏస్థాయిలో వివాదం చెలరేగిందో తెలిసిన విషయమే. అధికార ప్రభుత్వం అవద్రుల ఎంపికలో పక్షపాతం చూపిందని చాలా మంది పలురకాల విమర్శలు గుప్పించారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వివాదంపై స్పందించగా తాజాగా సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు.

‘టెంపర్’ సినిమాలో నటనకుగాను నందిని అందుకున్న ఆయన పోసాని కమ్మ కులస్థుడు కాబట్టి నందిని అందుకున్నాడు అనే నింద నాకొద్దు. ఈ నందిని వినమ్రంగా తిరస్కరిస్తున్నాను. ఈ నందులను రద్దు చేసి చంద్రబాబు నాయుడుగారు చెప్పినట్టు ఐవిఆర్ఎస్ పద్దతి అమలుజేసినప్పుడు అవార్డు వస్తే అప్పుడు తీసుకుంటాను అన్నారు.

 
Like us on Facebook