‘ధృవ’లో కీ రోల్ చేస్తోన్న పోసాని!
Published on Jul 31, 2016 9:17 am IST

posani
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలోని హాట్ టాపిక్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ తన కెరీర్‌లో ఈ స్థాయి స్టైలిష్ డిఫరెంట్ లుక్‌తో మరెప్పుడూ కనిపించి ఉండకపోవడంతో ‘ధృవ’ గురించి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇప్పటికే రకుల్ ప్రీత్, అరవింద్ స్వామి, నవదీప్.. తదితర భారీ తారాగణం నటిస్తోన్న ఈ సినిమాలో తాజాగా ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారు.

సినిమాకు కీలకమైన ఓ రాజకీయ నాయకుడి పాత్రలో పోసాని కనిపించనున్నారు. హైద్రాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన మూడో షెడ్యూల్ ఈరోజే మొదలైంది. గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కు రీమేక్‍గా తెరకెక్కుతోంది. ఆగష్టు 15న ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా సినిమా సెప్టెంబర్ నెలాఖర్లో గానీ, అక్టోబర్ మొదటి వారంలో కానీ విడుదల కానుంది.

 
Like us on Facebook