అల్లువారి హీరోకి అన్నీ కలిసొస్తున్నాయి !

Published on May 11, 2019 2:30 am IST

హీరో అల్లు శిరీష్ చేసిన కొత్త చిత్రం ‘ఏబిసిడి’. చిత్రం పూర్తై చాలారోజులే అయినా టీమ్ సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూసి ఈ మే నెల 17న రిలీజ్ చేయనున్నారు. టీజర్, ట్రైలర్, పాటలు బాగుండటంతో చిత్రంపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ నెలకొంది. సినిమాలో ఎంటర్టైనింగ్ కంటెంట్ ఉంటుందని అంతా భావిస్తున్నారు. హీరో శిరీష్ బోలెడు అంచనాలు పెట్టుకున్న తన గత చిత్రం ‘ఒక్క క్షణం’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ సినిమా విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారు.

చిత్ర యూనిట్ సైతం సినిమా రెండు సార్లు వాయిదాపడినా ప్రేక్షకుల దృష్టి సినిమాపై ఉండేలా చేయడం కోసం సోషల్ మీడియా ప్రమోషన్లు గట్టిగానే నిర్వహించింది. వీటన్నిటికి తోడు మే 17వ తేదీన వేరే చెప్పుకోదగిన సినిమాలేవీ విడుదలకు లేకపోవడం కూడా ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. మొత్తం మీద అన్ని వైఫులా సానుకూల పరిస్థితితుల్ని ఏర్పరుచుకుని బరిలోకి దిగుతున్న శిరీష్ హిట్ కొట్టేలానే ఉన్నాడు. రుక్సార్ దిల్లాన్ కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :

More