“సలార్” సాలిడ్ అప్డేట్ పై పాజిటివ్ వైబ్స్.!

Published on Aug 5, 2021 10:02 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కూడా ఒకటి. మోస్ట్ వైలెంట్ మెన్ గా డ్యూయల్ షేడ్స్ లో ప్రభాస్ కనిపించనున్న ఈ చిత్రం ఇటీవలే రెండో షెడ్యూల్ ని స్టార్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ షెడ్యూల్ స్టార్ట్ అవుతూనే ఆసక్తికర టాక్ కూడా బయటకి వచ్చింది సలార్ టైటిల్ రెండు రోజులు పాటు ట్రెండ్ అయ్యింది.

ఈ వారాంతంలోనే ఒక ఆసక్తికర అప్డేట్ ఈ చిత్రంపై రానుంది అని బజ్ వినిపించగా ఇప్పుడు అది నిజమే అన్నట్టుగా సినీ వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం కూడా ఈ అప్డేట్ పరంగానే పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ అప్డేట్ ఏంటి అన్నది వేచి చూడాలి. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబలే పిక్చర్స్ వారు భారీ వ్యవయంతో నిర్మాణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :