మెగా ఫ్యాన్స్ కి ఆశాభంగం తప్పేలా లేదు

మెగా ఫ్యాన్స్ కి ఆశాభంగం తప్పేలా లేదు

Published on Apr 24, 2020 5:00 PM IST

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఓ మంచి సోషల్ కాన్సెప్ట్ ఆధారంగా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో చరణ్ కూడా ప్రాధాన్యం ఉన్న ఓ కీలక రోల్ చేస్తున్నారని వార్తలు రావడంతో మరింత హైప్ వచ్చి చేరింది. చిరంజీవితో పాటు దర్శకుడు కొరటాల కూడా చరణ్ ఆచార్యలో నటించే విషయం పై స్పష్టత ఇచ్చారు. కాగా ఈ కాంబినేషన్ నెరవేరే సూచనలు లేవని టాక్ వినిపిస్తుంది.

లాక్ డౌన్ కి ముందు చరణ్ ఆర్ ఆర్ ఆర్ డేట్స్ అడ్జస్ట్ చేసి ఆచార్యకు కేటాయించాలని భావించారు. ఇక ఆర్ ఆర్ ఆర్ కూడా 2021 జనవరికి వాయిదా పడడంతో రాజమౌళి ఆచార్యలో నటించేందుకు చరణ్ కు వెసులుబాటు కల్పించారు. ఐతే లాక్ డౌన్ కారణంగా నెల రోజులకు పైగా షూటింగ్ ఆగిపోయింది. మరియు సమీప కాలంలో సాధారణ పరిస్థితులు ఏర్పడి షూటింగ్ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. దీనితో చరణ్ ఆచార్యకు డేట్స్ ఇచ్చే అవకాశం లేదని టాక్. కనుక ఆచార్య లో చరణ్ నటించడం కష్టమే అంటున్నారు. కొరటాల సైతం మరో హీరో కోసం ఇప్పటికే సెర్చింగ్ మొదలుపెట్టాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు